రాష్ట్రీయం

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘సాహిత్యోత్సవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 12: హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ (డిసెంబర్ 15- డిసెంబర్ 30) సందర్భంగా 16వ తేదీ నుంచి పది రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలను జరపాలని బుక్‌ఫెయిర్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ లిటరరీ కన్వీనర్ డాక్టర్ ఎస్ రఘు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కె చంద్రమోహన్ సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
సాహితీ ప్రియులకు, పరిశోధకులకు, విద్యార్థులకు ఈ సాహితీ సదస్సులు ఉపయోగపడుతాయని ఆకాక్షించారు. సాహిత్య ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గూడ అంజన్న వేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి ప్రారంభిస్తారన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఎస్‌వి సత్యనారాయణ పాల్గొంటారని వారు చెప్పారు. తెలుగు సాహిత్యంలోని విభిన్నవాదాలు, ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయిత పాత్ర, తెలంగాణ కథ, నవల, వచన కవిత-పరిణామ వికాసాలు, ఉద్యమాలు- ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్ర్తివాద సాహిత్య చైతన్యం, సాహిత్య విమర్శ, తెలంగాణ బాలసాహిత్యం వంటి అంశాలపై ప్రముఖ సాహితీవేత్తలతో ప్రసంగాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమానికి డాక్టర్ ఎన్ గోపి, నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, ఎం వేదకుమార్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి, జి లక్ష్మీనర్సయ్య, యాకూబ్, సుద్దాల అశోక్‌తేజ, భూపాల్, అర్టిస్ట్ పి శంకర్, ఏలే లక్ష్మణ్, పత్తిపాక మోహన్, ఎం నారాయణశర్మ పాల్గొంటారని చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లిటరరీ
కన్వీనర్ రఘు, చంద్రమోహన్