రాష్ట్రీయం

ఫ్రీ సర్వీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: నగదురహిత చెల్లింపుల్లో సర్వీసు చార్జీల బాదుడులేకుండా ప్రజలకు ఉచిత సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రయివేట్ సంస్థలు సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఆ భారంనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని సూచించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్టు ఐటి మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి కెటిఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమైంది. మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, టి-వాలెట్ సర్వీసు ప్రొవైడర్లు సబ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగాలని, మొదట్లో సాధ్యమైనంత ఎక్కువగా క్యాష్ లెస్ చెల్లింపులు చేస్తూ దశలవారిగా తెలంగాణను నగదురహిత చెల్లింపుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కెటిఆర్ వివరించారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితులను ఒక అవకాశంగా తీసుకుంటామని, క్యాష్‌లెస్ పద్ధతులతో ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్ చెల్లింపులకు వెళ్లాల్సిందేనని కెటిఆర్ సూచించారు. క్యాష్ లెస్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా కెటిఆర్ వివరించారు. క్యాష్‌లెస్ లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామన్నారు. దీని కోసం ఆర్థిక, ఐటి శాఖలు ఇప్పటికే ఆర్థిక వ్యవహారాలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కెటిఆర్ చెప్పారు. ప్రజల నంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ టి-వ్యాలెట్ ద్వారా ఉచితంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు, ప్రైవేటు సంస్థలు, ఆర్థిక వ్యవస్థల లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేకుండా పూర్తిగా ఉచితం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. వివిధ సంస్థలు, బ్యాంకుల మధ్య పరస్పర సహకారంతో టి-వాలెట్‌తో కలిసి పనిచేసేలా చూస్తామన్నారు. టి-వాలెట్‌తో ఇతర వాలెట్‌లకు చెల్లింపులు చేసే సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈమేరకు సిఎం కెసిఆర్ ప్రధానితో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు. టి-వ్యాలెట్ పై ఐటి శాఖ కార్యదర్శి మంత్రివర్గ ఉప సంఘానికి ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే టి-వాలెట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, సెక్యూరిటీ అత్యున్నతంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటు చేసిన సురేష్ చందా టాస్క్ ఫోర్స్ తమ కమిటీ అధ్యయనాన్ని, సూచనలను ఉప సంఘానికి తెలియజేసింది.