రాష్ట్రీయం

ప్రగతికి రోడ్‌మ్యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత కలెక్టర్ల తొలి కాన్ఫరెన్స్ బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనుంది. సిఎం కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ప్రారంభమైన తర్వాత కలెక్టర్లతో జరిగే తొలి కాన్ఫరెన్స్ కూడా ఇదే కావడం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సంస్కరణలకు రెండు నెలల కిందట దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఎంతమేరకు ఫలించింది? ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గతంలోకంటే ఏమేరకు మెరుగైంది అన్న విషయాలను సిఎం స్వయంగా కలెక్టర్లతో సమీక్షించనున్నారు. జిల్లా కేంద్రాలను అభివృద్ధి మండళ్లుగా తీర్చిదిద్దడానికి కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాల్లో గత రెండు నెలలుగా ఏమేరకు చర్యలు తీసుకున్నారో సిఎం సమీక్షిస్తారు. కొత్త జిల్లా కేంద్రాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతోపాటు జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణాలకు స్థలాలను ఎంపిక చేసి, ఈ సమావేశంలో కలెక్టర్లు సిఎంకు అందిస్తారు. పెద్ద నోట్ల రద్దువల్ల జిల్లాల్లో ఆదాయ వనరులపై ఎలాంటి ప్రభావం చూపిందో కూడా కలెక్టర్లు మరో నివేదికగా సమర్పించనున్నారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సిఎం సమీక్షిస్తారు. కొత్త జిల్లాల్లోవున్న వనరులు, అభివృద్ధి పర్చాల్సిన అంశాలపై జిల్లాలవారీగా ప్రతిపాదనలతో సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. కొత్త జిల్లా కేంద్రాలను అభివృద్ధి కారిడార్లుగా తీర్చిదిద్దడానికి ‘నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’ నినాదంతో కలెక్టర్లు తమ జిల్లాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా, ప్రతిష్టాకర కార్యక్రమాల అమలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.