రాష్ట్రీయం

సాంస్కృతిక వికాసానికి కేంద్రం స్కాలర్‌షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలల సాంస్కృతిక వికాసానికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఢిల్లీలోని సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం (సిసిఆర్‌టి) కల్చరల్ టాలెంట్ సెర్చి స్కాలర్‌షిప్ స్కీంను ప్రకటించింది. ప్రతిభావంతులైన 10 నుండి 14 ఏళ్ల వయస్సున్న బాలబాలికలకు సంగీతం, నృత్యం, రంగస్థల నటన, చిత్రలేఖనం, శిల్పకళ, హస్తనైపుణ్యాలు, సృజనాత్మక రచన, సాహితీపరమైన కళలు మొదలైన రంగాల్లో శిక్షణ అందిస్తారు. ఆసక్తి ఉన్న వారు సిసిఆర్‌టి ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
15న మిలటరీ కాలేజీకి జెఎన్‌యు విసి
ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 90వ స్నాతకోత్సవానికి న్యూఢిల్లీలోని జెఎన్‌యు విసి డాక్టర్ మామిడాల జగదీష్‌కుమార్ హాజరుకానున్నారు.