రాష్ట్రీయం

విద్యుత్ ఆదాచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: మిగులు విద్యుత్‌ను సాధించడమే కాకుండా, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించి, ఇంధన పొదుపులో దేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో గత రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్న ఇంధన పొదుపు విధానాలు, ఎల్‌ఇడి బల్బుల వాడకం వల్ల ఆరుకోట్ల 40 లక్షల వాట్‌ల విద్యుత్‌ను ఆదా చేశామని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీ బుధవారం నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో ప్రజలు, విద్యుత్ సిబ్బంది భాగస్వామ్యం కావాలని ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎల్‌ఇడి బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని గిరిజన తాండాల్లో రంప సహకార మహిళా సంఘం ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. సాగునీటి కోసం రేయింబవళ్లు పంప్‌సెట్ల వద్ద కూర్చుని పాముకాటుకు, కరెంటు షాక్‌కు గురి కాకుండా ఉండే విధంగా వ్యవసాయానికి పగలు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దశల వారీగా 15 లక్షల నాసిరకం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో సంపూర్ణంగా నాణ్యత కలిగిన ఫైవ్‌స్టార్ పంపుసెట్లను ఏర్పాటు చేసి 30 శాతం విద్యుత్ పొదుపును సాధించాలని ఆదేశించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి కనిష్టంగా ఒకటిన్నర లక్షల ఫైవ్‌స్టార్ పంపుసెట్లను అమర్చాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆన్-ఆఫ్ చేసే విధంగ సెల్‌ఫోన్‌ను రిమోట్‌గా మార్చుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యుత్ పంపిణీ,ప్రసార నష్టాలను తొలి సారిగా సింగిల్ డిజిట్ 9.36 శాతానికి చేర్చామన్నారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గితే దాని ఫలితాలు వినియోగదారులకు దక్కుతాయన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు ఉండే ఎల్‌ఇడి ట్యూబ్ రేటును రూ. 230కే అందించాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక లోటున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుస్ధిరత సాధించేందుకు అందరి సహకారం కావాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల రూ.400 రేటున్న ఎల్‌ఇడి బల్బు దాదాపు రూ.60కి తగ్గిందన్నారు. విద్యుత్తు పొదుపు సంరక్షణ విధానాల వల్ల నెలవారీ కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇంధన పొదుపు వల్ల ఏకంగా 51875 కార్బన్ వ్యర్థాలను నివారించామన్నారు. ఇంధన పొదుపుమహోద్యమంలో కాలుష్య నివారణను భాగం చేయాలన్నారు. ఈ వారం రోజులు అన్ని పాఠశాలలు, కాలేజీల విద్యార్ధులు, స్వచ్చందసేవా సంస్ధల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేయాలని ఆయన బహిరంగ లేఖలో కోరారు.