ఆంధ్రప్రదేశ్‌

క్యూల్లోనే సొమ్మసిల్లుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: రద్దయిన పెద్ద కరెన్సీ నోట్లకు ఇక కాలం చెల్లబోతోంది... మరో పదిహేను రోజులు మాత్రమే గడువుమాత్రమే ఉండటంతో తమ వద్ద ఉన్న సొమ్మును మార్చుకోవడానికి సామాన్యులు పడుతున్న కష్టం వర్ణనాతీతంగా వుంది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక సొమ్మసిల్లిపడిపోతున్నారు. కరెన్సీ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పలేదు. సామాజిక పింఛన్లకు అవసరమైనంత కరెన్సీ సిద్ధంచేయలేక, బ్యాంకు ఖాతాలకే జమచేయడంతో క్యూలైన్లలో నిల్చుంటున్న పింఛనుదార్లు నిలబడలేక కూలబడిపోతున్నారు. నగదు విత్‌డ్రాకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఒక రకమైన నిబంధనలు పెడుతుంటే, స్థానిక బ్యాంకర్లు తమదైన సొంత నిబంధనలు అమలుచేస్తుండటంతో ప్రజల ఇక్కట్లు రెట్టింపయ్యాయి. వారానికి రూ.24 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్‌బిఐ కల్పించగా, కొందరు బ్యాంకర్లు నగదు లేదంటూ రోజుకు రూ.2000కు మించి ఇవ్వడంలేదు. దీనితో ఆర్‌బిఐ విధించిన నిబంధన నవ్వులపాలవుతోంది. వివాహ అవసరాలకు రూ.2లక్షల వరకు విత్‌డ్రా అవకాశం కల్పించినా ఆచరణలో ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. చివరకు వారపు గరిష్ఠ పరిమితి రూ.24 వేలైనా ఇప్పించమంటూ శుభలేఖలతో పలువురు తండ్రులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న దృశ్యాలు రోజూ కనిపిస్తున్నాయి. రోజుకు రూ.2000 డ్రా చేసుకునే అవకాశమిచ్చిన ఎటిఎంలు గోదావరి జిల్లాల్లో పూర్తిగా పడకేశాయి. దాదాపు 70 శాతానికి పైగా ఎటిఎంలు పనిచేయడంలేదు. వ్యవసాయ ప్రధాన జిల్లాలైన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్‌లో విక్రయించిన ధాన్యం సొమ్ముతో రబీ పంటకు సన్నాహాలు చేసుకోవడం ఇక్కడి రైతులకు అలవాటు. అయితే రైతులు విక్రయించిన ధాన్యం సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతోంది. ఆ సొమ్ము విత్‌డ్రా చేసుకోవడానికి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల బ్యాంకుల్లో కనీసం రోజుకు రూ.2000 కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకటో తేదీన స్థానిక సంస్థల కార్యాలయాల్లో పింఛన్లు అందుకునే వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు 15వ తారీఖు వచ్చినా అందుకోలేని స్థితిలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 4.50 లక్షల మంది ఫించనుదార్లలో 3.50 లక్షల మందికి ఇప్పటికీ పింఛను అందలేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. వీరిలో సుమారు 80వేల మందికి బ్యాంకు ఖాతాలులేవు. ఖాతాలు తెరవడానికే క్యూ లైన్లలో నిల్చుంటున్న వీరికి ఇక పింఛను మొత్తం ఎప్పటికి అందుతుందో ఆ దేవుడికే తెలియాలి.
బ్యాంకు క్యూలైన్‌లో వృద్ధురాలు మృతి
బంగారుపాళ్యం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వృద్ధులకు అందచేసే పింఛన్లను బ్యాంకుల ద్వారా అందించనుండటంతో బ్యాంకుల వద్ద క్యూలో గంటల తరబడి నిలబడుతున్న వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. పింఛన్ కోసం బ్యాంకు క్యూలో నిలబడిన వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సిండికేట్ బ్యాంకు వద్ద జరిగింది.తూంపానయపల్లికి చెందిన రామన్న భార్య లక్ష్మమ్మ (65) పింఛన్ పొందేందుకు సిండికేట్ బ్యాంకులో ఖాతా తెరవాలని కుమారుడు సుబ్రహ్మణ్యంతో కలిసి బుధవారం బ్యాంకు వద్ద క్యూలో నిలబడింది. క్యూ ఎంతకీ తరగకపోవడంతో క్యూలైన్‌లోనే లక్ష్మమ్మ అస్వస్థతకు గురైంది. ఈ వృద్ధురాలిని కుమారుడు సుబ్రహ్మణ్యం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో బాత్‌రూంకు వెళ్లాలని తెలిపింది. అప్పటికే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

సిఐడి ప్రధాన కార్యాలయం ప్రారంభం
విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: సిఐడి రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడలో ప్రారంభమైంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోని ఆర్టీసి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఈ విభాగం అదనపు డిజిపి ద్వారక తిరుమలరావు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే సిఐడి రాష్ట్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణం ప్రాధమిక దశలో ఉండగా.. తాత్కాలిక రాజధాని విజయవాడలో సీఎంతోపాటు, ఇతర మంత్రులు, ప్రభుత్వ శాఖల రాష్ట్ర కార్యాలయాల భవనాలు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డిజిపి క్యాంపు కార్యాలయం విజయవాడ నుంచే పని చేస్తోంది. ఆర్టీసి భవన్‌లో ఇటీవల ఏసిబి కార్యాలయం ప్రారంభమైంది కూడా. ఇక్కడే నాలుగో అంతస్తులో అధునాతనంగా తీర్చిదిద్దిన సిఐడి కార్యాలయాన్ని అదనపు డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రారంభించడంతోపాటు, ఆయన ఛాంబర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, పాలనా విభాగాలను ప్రారంభించారు.