రాష్ట్రీయం

ఆకట్టుకున్న భూతప్పల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 14: అనంతపురం జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలో బుధవారం జరిగిన భూతప్పల ఉత్సవం విశేషంగా ఆకట్టుకుంది. భూతప్పల కాలి స్పర్శ కోసం భక్తులు పరితపించారు. భక్తరహళ్లిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివార్లకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు భూతప్పసేవ కొనసాగింది. దేవతామూర్తుల విగ్రహాలను మోసుకొచ్చే భూతప్పల కాలి స్పర్శ కోసం గ్రహపీడితులు, వ్యాధిగ్రస్తులు, సంతానం లేని మహిళలు, పెళ్లికాని యువతులు చన్నీటి స్నానం చేసి తడిబట్టలతో దారికి అడ్డంగా బోర్లా పడుకున్నారు.

తగ్గిన మావోల ప్రభావం
డిఐజి సిహెచ్ శ్రీకాంత్
సబ్బవరం, డిసెంబర్ 14: ఎపి, ఎఒబిలో మావోయిస్టుల ప్రాబల్యం, ప్రభావం పూర్తిగా తగ్గిందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సిహెచ్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్‌కు బుధవారం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల ఎఒబిలో ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందన్నారు. యుక్తవయస్సులో ఉండి మావోయిస్టు ఉద్యమాల పట్లఆకర్షితులైన యువత ఇప్పుడు పోలీసుల సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్నారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో గాయపడిన ఆర్‌కెను లొంగిపోవాలని పిలుపునిచ్చారు కదా? అటువైపు నుంచి స్పందన ఎలా ఉందని విలేఖరులు ప్రశ్నించగా ఆయన జవాబిస్తూ ఒడిశా రాష్ట్రం మల్కన్‌గరి జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని ఇంకా మావోయిస్టులు ఉద్యమం ఉనికి చాటుకుంటున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ శాఖలో ఖాళీల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుళ్ళ పోస్టుల ఖాళీలను ఇటీవల విరివిగా భర్తీ చేస్తున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులకు సమానంగా డ్యూటీలు నిర్వహిస్తున్నా తమకు తగిన గుర్తింపులేదంటూ హోంగార్డులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.