రాష్ట్రీయం

నగదు రూపంలోనే పింఛన్ల పంపిణీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 15: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను మళ్లీ నగదు రూపంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. నగదు కొరత కారణంగా రెండు వారాలు గడిచినా పింఛనుదారులకు ఇంతవరకూ నగదు అందకపోవడంపై స్పందించిన ప్రభుత్వం తాత్కాలికంగా పింఛను సొమ్ము లబ్ధిదారులకు నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలకు సంబంధించి 1వ తేదీనే పింఛను సొమ్మును లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే రాష్టవ్య్రాప్తంగా సొమ్మును అందుకున్న లబ్ధిదారుల సంఖ్య కేవలం 12 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత అమలులో లోపాలు తలెత్తాయని, దీని కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం నుంచి బయట పడాలంటే నగదు పంపిణీ చేయడమే మంచిదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెల పింఛను ఇంకా అందని వారికి రానున్న రెండు, మూడు రోజుల్లో అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో బ్యాంకర్లతో సంప్రదించి పింఛను మొత్తం వెనక్కి తీసుకుని అందులో 50 శాతం గతంలో మాదిరిగానే లబ్ధిదారులకు నగదు రూపంలో పంపిణీ చేయడం మంచిదని సిఎం అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన 50 శాతం బ్యాంకు ఖాతాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రానున్న జనవరి నెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా బ్యాంకుల్లో నగదు తీసుకుని 50 శాతం నగదు చేతికి ఇచ్చి మిగిలిన 50 శాతం ఖాతాలో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.