రాష్ట్రీయం

పర్యటనలు, సెలవులు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: శాసనసభా, శాసనమండలి సమావేశాలు ముగిసే వరకు అధికారులు పర్యటనలు, సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆదేశించారు. శీతాకాల శాసనసభా, శాసనమండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం శాఖాధిపతులతో ప్రదీప్ చంద్ర సమావేశమయ్యారు. ప్రస్తుత సమావేశాలలో సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే ప్రభుత్వం సమాధానం ఇచ్చేందుకు తమ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో ప్రతీ శాఖ విధిగా నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
వివిధ శాఖల తరఫున శాసనసభకు, శాసనమండలికి హాజరయ్యే అధికారులు అప్రమత్తంగా ఉండి సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వడానికి అప్రమత్తంగా ఉండాలన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న సమాధానాలను వెంటనే సమర్పించాలని సిఎస్ ప్రదీప్ చంద్ర ఆదేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అసెంబ్లీ, కౌన్సిల్‌కు సంబంధించిన వెబ్ సైట్‌ను ఈ సందర్భంగా సిఎస్ ప్రదర్శించారు. కలెక్టర్ల సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి అధికారులంతా బాగా పని చేశారని ఆయన అభినందించారు. శాసనసభ సమావేశాల అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు జిల్లాల పర్యటనకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు కలెక్టర్లకు మార్గదర్శనం చేయాలని ఆయన సూచించారు. సిఎస్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎంజి గోపాల్, ఎస్‌కె జోషి, అజయ్ మిశ్రా, ముఖ్య కార్యదర్శులు సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి, బిఆర్ మీనా, సోమేశ్‌కుమార్, చిత్రా రామచంద్రన్, నవీన్ మిట్టల్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లో శాఖాధిపతులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర