రాష్ట్రీయం

విజయవాడకు విద్యాశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ రాష్టస్థ్రాయి కార్యాలయాలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లోగా అధికారులు, కార్యాలయాలు, రికార్డులు విజయవాడకు మారాలని సంబంధిత శాఖ సీనియర్ అధికారులు ఆదేశాలిచ్చారు. ఈమేరకు విజయవాడ నుంచి బందరుకు వెళ్లే దారిలో సిరీస్‌కు సమీపంలో ఒక పెద్ద భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. 90వేల చదరపు గజాలున్న భవనంలో ప్రస్తుతం 60వేల చదరపు గజాల భవనం వినియోగానికి సిద్ధంగా ఉంది. అందులో పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయాలు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శుల కార్యాలయాలు, అనుబంధంగా ఉండే ఇతర సంస్థల కార్యాలయాలు దాంట్లోకి తరలిస్తారు.
ఆరు జిల్లాల్లో పాఠశాల భవనాల తనిఖీ
ఇటీవల భారీ వర్షాలకు గురైన ఆరు జిల్లాల్లో పాఠశాలల భవనాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఆయా జిల్లాల డిఇఓలు, పిఓలు, ఇఇలతో కమిటీలను నియమించింది. అనుమానం ఉన్న వివిధ స్కూళ్లను పరిశీలించి ఈ కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. తదనుగుణంగా వాటి మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇటీవల చిత్తూరులో పైకప్పు కూలి విద్యార్థి మృతిచెందిన నేపథ్యంలో సిఎం చంద్రబాబు స్కూళ్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.
ఆత్మహత్యలపై కమిటీ
జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను అనే్వషించి సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చక్రపాణి కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. పదో తరగతి నుంచి ఇంటర్‌కు వచ్చేసరికి అకస్మాత్తుగా సిలబస్ పెరగడం, దాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురవుతున్నారని కమిటీ పేర్కొంది. కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
డిఎస్సీపై నాలుగు కేసులు
డిఎస్సీ నిర్వహించి మెరిట్ జాబితాలు సిద్ధం చేసినా పోస్టింగ్‌లు ఇవ్వలేకపోవడానికి కారణం డిఎస్సీ నిర్వహణపై మరో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉండటమేనని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆ నాలుగు కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే డిఎస్సీలో అనేక పొరపాట్లకు కారణమైన 18మంది అధికారులపై వేటు వేసినట్టు చెప్పారు. ప్రధానంగా అప్పటి ఎస్సీఇఆర్‌టి డైరెక్టర్ లక్ష్మీ వాట్, ప్రొఫెసర్ వనజాక్షి, మరో 18మంది చర్యలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు.
ర్యాగింగ్‌పై విజయలక్ష్మి కమిటీ
ర్యాగింగ్ నివారణకు నియమించిన విజయలక్ష్మి, కృష్ణమోహన్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.