రాష్ట్రీయం

మహిళలూ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఎయిర్‌ఫోర్స్‌లో యువకులతోపాటు యువతులు కూడా చేరడం సాహసోపేతమేనని శ్రీలంక ఎయిర్‌ఫోర్స్ మార్షల్ కమాండర్ కెవిబి జయంపతి అన్నారు. శనివారం హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో రాణిస్తున్న యువతీయువకులను ఆయన ప్రశంసించారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన 110 మంది ఫ్లైట్ కేడెట్స్‌లో 14మంది మహిళలు ఉండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
శిక్షణలో మెరిట్ సాధించిన పైలట్‌లకు ఆయన అవార్డులు బహుకరించారు. ఫ్లయింగ్ ఆఫీసర్లు చయాన్ అగర్వాల్, వరదరాజన్‌లు రాష్టప్రతి అవార్డును గెలుచుకున్నారు. వృత్తి నైపుణ్యతను పెంచుకుంటూ భవిష్యత్తులో మిలటరీ సారథులుగా, ఏవియేటర్లుగా రాణించాలని ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ ఎస్‌ఆర్‌ఆర్ నాయర్, ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ అమిత్ తివారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సారంగ్’ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసం సభికులను కనువిందు చేసింది.

చిత్రం..పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న శ్రీలంక ఎయిర్‌ఫోర్స్ మార్షల్
కమాండర్ కెవిబి జయంపతి