రాష్ట్రీయం

కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా మాసాబ్‌టాంక్ సమీపంలోని శాంతి నగర్ కాలనీలో ఆదివారం నాడు మరో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ కాలనీలోని శ్రీదుర్గ కానుమిల్లి అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న కెబిఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హన్మంత్ దాలియాపై ఓ దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ సంఘటనలో గాయపడిన బ్యాంక్ ఎండి హన్మంత్‌ను స్థానికులు బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. దుండగుడు తొలుత అపార్టుమెంట్‌కు వచ్చి బ్యాంకు లో పనిచేసే వ్యక్తి కావాలని వాచ్‌మన్‌ను అడిగాడు. బ్యాంక్‌లో పనిచేసే వారెవరూ లేరని చెప్పడంతో అతని కారును గుర్తుపడతానంటూ ఓ కారుని చూపి, ఈ కారు అతనిదే అని చెప్పడంతో వాచ్‌మన్ కారు యజమాని హన్మంత్ దాలియాతో మాట్లాడి సదరు అపరిచిత వ్యక్తిని మేడపైకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అపరిచిత వ్యక్తి, బ్యాంక్ ఎండి కొద్దిసేపు ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకున్నారని వాచ్‌మన్ చెప్పినట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ తరువాత కొద్దిసేపటికే కాల్పుల శబ్దం రావడంతో వాచ్‌మన్ మళ్లీ పైకి వెళ్లిచూడగా హన్మంత్ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. అప్పటికే నిందితుడు పారిపోయాడు. కాగా అగంతకుడు కాల్పులు జరపడానికి కారణం తెలియడం లేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని డిసిపి తెలిపారు.
కాగా హన్మంత్ దాలియాను నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పులకు తెగబడిన దుండగుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హన్మంత్ దాలియా ఇంట్లో దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని, మొదటి రౌండ్ గాల్లోకి, రెండో రౌండ్ కాళ్లపైకి జరపడంతో హన్మంత్ కాలుకు గాయమైందన్నారు. బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. దుండగుడు మొదటగా వాచ్‌మెన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్ కమ్ ఫోన్‌లో బ్యాంక్ ఎండితో మాట్లాడించి పైకి తీసుకెళ్లాడని, హన్మంత్ దాలియాతో నిందితుడు బ్యాంక్ అధికారినంటూ ఒకసారి..క్రైం టీమ్ పోలీస్‌నంటూ మరోసారి చెప్పినట్టు గుర్తించామన్నారు. అయితే బాధితుడిపై కాల్పులు జరిపింది మాత్రం ఒక్కరేనని మహేందర్‌రెడ్డి చెప్పారు.

చిత్రాలు..కాల్పుల్లో గాయపడిన కెబిఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హన్మంత్ దాలియా
ఘటనపై వివరాలు సేకరిస్తున్న డిసిపి వెంకటేశ్వరరావు