రాష్ట్రీయం

టిడిపిలోకి ఎమ్మెల్యే కల్పన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 18: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలుగుదేశంలో చేరేందుకు ముహూర్తం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరిగింది. వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలిగా, శాసనసభ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యత నిర్వహిస్తున్న కల్పన కొన్ని నెలలుగా టిడిపిలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆమె వాటిని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుండి ఆదివారంనాడు కల్పనకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలుగుదేశం నాయకులు చెప్పారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని వైసిపి నాయకులు కూడా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే కల్పన అందుబాటులో లేరు. కల్పన తెలుగుదేశంలో చేరితే పామర్రు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.