రాష్ట్రీయం

డబుల్ ట్రబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18:ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించిన ‘డబుల్ బెడ్‌రూమ్’ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎన్నికల ప్రణాళిక రూపొందించే సమయంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి నాలుగైదు లక్షల రూపాయలు అవుతాయని భావించారు. చివరకు అది ఏడు లక్షల రూపాయల ధరకు చేరుకుంది. ఎప్పటికప్పుడు టెండర్లు పిలవడమే కానీ పనులు సాగడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం జిహెచ్‌ఎంసి పరిధిలో 5,57, 836 మంది, జిల్లాల నుండి 5,13,146 మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తులు ఆహ్వానించడం, తుది తేదీ ప్రకటించడం వంటివేవీ లేకముందే దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తులు ఆహ్వానిస్తే మరింతమంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికి పూర్తయిన ఇళ్లు 976 ఇళ్లు మాత్రమే. కనీసం ఒక్క శాతం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. జిల్లాల్లో 580 ఇళ్లను, హైదరాబాద్‌లో 396 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐడిహెచ్ కాలనీలో హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చేసి కొత్తగా నిర్మించారు. ఈ ఇళ్ల నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించడానికి ఇదీ ఒక కారణమే. ఎన్నికల ఫలితాలు రాగానే మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లను వెంటనే నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లో లక్ష, జిల్లాల్లో లక్ష మొత్తం రెండు లక్షల ఇళ్ల నిర్మాణం జరపనున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు లేదు. దరఖాస్తులు లక్షల్లో ఉన్నా లబ్దిదారుల ఎంపిక సైతం జరగలేదు. జిల్లాల్లో 42,817 మందిని, జిహెచ్‌ఎంసి పరిధిలో 9,137 మందిని అర్హులుగా గుర్తించారు. ఏడాది క్రితం ముఖ్యమంత్రి లక్ష ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటిస్తే, ఇప్పటి వరకు పది శాతం లబ్దిదారులను గుర్తించారు.
ప్రతి సందర్భంలోనూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని అధికార పక్షం ఉపయోగించుకుంటున్నా ఇళ్ల నిర్మాణంలో ఆ వేగాన్ని చూపించడం లేదు. చివరకు నోట్ల రద్దు అంశంలో సైతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ఉపయోగించుకున్నారు. నోట్ల రద్దుతో నిర్మాణ పనులు చేసే కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే రెండు వేల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటివరకు హైదరాబాద్‌కు సంబంధించి ఐడిహెచ్ కాలనీలో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇక ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న నర్సన్నపేట, ఎర్రవెళ్లి గ్రామాల్లో మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ రెండు చోట్ల సామూహికంగా గృహ ప్రవేశం నిర్వహించి, ముఖ్యమంత్రి హాజరయ్యారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ కంపెనీలు తక్కువ ధరకు సిమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. 230 రూపాయలకు బ్యాగ్ ఇచ్చే విధంగా అన్ని సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదిరింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకోవడంతో భారం తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కలిపి ఇళ్లు నిర్మించాలనే ఆలోచన కూడా మొదట్లోనే ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం, డబుల్ బెడ్‌రూమ్ పథకం రెండూ కలిపి కేంద్రమే ఏదైనా పేరు పెడితే ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గణనీయమైన సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకపోతే.. అధికార పార్టీకి గత ఎన్నికల్లో ఉపయోగపడిన ఈ పథకమే ఈసారి దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

చిత్రం..ఐడిహెచ్‌లో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు