రాష్ట్రీయం

ఎక్సైజ్ అధికారి ఇంట్లో రెండోరోజూ ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ అదనపుకమిషనర్ కె.లక్ష్మణ భాస్కర్ సహా, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆదివారం రెండో రోజూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కొనసాగించారు. సోదాల్లో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు ఎసిబి డిఎస్పీ (విశాఖ అర్బన్) కె.రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వీటి మార్కెట్ విలువ సుమారు 50 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా 1994లో ఉద్యోగంలో చేరిన లక్ష్మణ భాస్కర్ పలు హోదాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ భాస్కర్‌ను విశాఖ తీసుకువచ్చి సీతమ్మధారలోని ఆయన స్వగృహంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో రెండు ప్లాట్లు, హైదరాబాద్‌లో నాలుగు స్థలాలు, మహబూబ్‌నగర్‌లో ఐదు స్థలాలు, విశాఖపట్నంలో ఏడు స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎసిబి డిఎస్పీ తెలిపారు.