రాష్ట్రీయం

తెలంగాణ రోడ్లకు రూ.41 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం సుమారు 41 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2500 కిలో మీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చే ప్రాజెక్టుకు 40,800 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలకు 16 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో జల రవాణా వ్యవస్థకు నావిగేషన్ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ జల రవాణా వ్యవస్థ ద్వారా జాతీయ రహదారులు, ఎయిర్ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు.
ఇలాఉండగా తెలంగాణలో జాతీయ రహదారుల ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి గడ్కరీ భారీ మొత్తంలో నిధులు కేటాయించినందుకు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా ఆ రాష్ట్రంలోని రహదారులపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.