రాష్ట్రీయం

యువతే సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 24: స్వాస్థ్య విద్యావాహినితో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘స్వాస్థ్య విద్యావాహిని’ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వినూత్న రీతిలో ప్రజలకు ఆరోగ్య విద్య అందించడం స్వాస్థ్య విద్యావాహిని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒక పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని అన్నారు. ఈ కార్యక్రమంలో 33వేల మంది వైద్య విద్యార్థులు 446 బృందాలుగా ఏర్పడి 10 నెలలపాటు పదిరకాల థీమ్‌లతో వివిధ గ్రామాలను సందర్శిస్తారని తెలిపారు. ఈ పది థీమ్‌లపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇందులోభాగంగా గ్రామాల్లో ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’తోపాటు అందరికీ ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై వివరిస్తారన్నారు. ప్రపంచంలో మనదేశానికి తరగని సంపద యువతేనని, అన్ని వృత్తుల్లోకన్నా వైద్యవృత్తి చాలా కష్టమైందన్నారు. ఇంటర్మీడియట్ అనంతరం కనీసం పది పదిహేనేళ్లు కష్టపడతారని, దీంతో వారి కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు దూరమవుతారని అన్నారు. వైద్య విద్యార్థులు గ్రామాల సందర్శనలో ప్రజలకు వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. సమైక్యాంధ్రలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా తొమ్మిది వైద్య కళాశాలల సంఖ్యను 30కి పెంచినట్లు చెప్పారు. గతంలో మన రాష్ట్రంలో సరైన వైద్యవిజ్ఞానం అందుబాటులో లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు భార్య బసవరామ తారకం క్యాన్సర్ వ్యాధికి గురై వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందన్నారు. నేడు రాష్ట్రంలోనే అత్యాధునిక వైద్యపరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమంలో గ్రామాలు సందర్శించిన విద్యార్థులకు మార్కులు కుడా ఇవ్వాలని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉప కులపతిని ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
టీచర్ అవతారమెత్తిన బాబు
స్వాస్థ్య విద్యావాహినిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీచర్‌గా అవతారమెత్తారు. వైద్య విద్యార్థులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సుమారు 30 నిమిషాలపాటు చంద్రబాబు విద్యార్థులతో సరదాగా గడిపారు. అనంతరం నగరంలో ఆకస్మిక పర్యటన జరిపి తనిఖీలు నిర్వహించారు.

చిత్రాలు..స్వాస్థ్య విద్యావాహిని ప్రారంభ సభలో విద్యార్థులను ఉత్సాహపరుస్తూ సరదాగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు