రాష్ట్రీయం

సమ్మోహనం.. కూచిపూడి సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 24: అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి. ముఖ్యంగా డాక్టర్ యశోదా ఠాకూర్, జ్యోతి చింతలపూడి ప్రదర్శించిన అష్టవిధ నాయికాస్ అభినయ విన్యాసం ఆహూతులను పరవశింపజేసింది. కళాకారులు తమ హావభావ విన్యాసాలతో కళ్లు మాట్లాడతాయని, నర్తిస్తాయని నిరూపించారు. ప్రియుని కోసం ప్రియురాలు ఎదురుచూడడం, ప్రియుడు సమయానికి రాకపోవడంతో ‘సఖియా వినుమా.. సఖుని రమ్మనవే’.. అంటూ ప్రాధేయపడటం ప్రేక్షకులను సైతం మైమరపించింది. ప్రియుని అనుమానించి, అవమానించిన తర్వాత పశ్చాత్తాపపడుతూ ‘నా కోపమే నన్నింత చేసేనా..’ అంటూ నిశ్శబ్ద వాతావరణంలో కనబరిచిన కలవరపాటు అభినయానికి ఆహూతులు కళ్లప్పగించేశారు. ఆసాంతం తిలకించి హర్షధ్వానాలతో కళాకారులను అభినందించారు. ప్రముఖ నృత్య కళాకారిణి మహాలక్ష్మి వీరిని దుశ్శాలువాలతో సన్మానించారు. డాక్టర్ పసుమర్తి శేషుబాబు, శ్రీనివాసశర్మ, విఠల్ ముగ్గురూ కలిసి ఒకేసారి చేసిన నాట్యం, కుమారి సాయిదీపిక చేసిన నాట్య విన్యాసం ఆసాంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కళాకారులను దుశ్శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిర్వహిస్తున్న నాట్య సమ్మేళనం అద్భుతం, మహోన్నతమని అన్నారు. ఈ కళావేదిక కళాకారులకు ఒక వరమన్నారు. విజయవాడ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఎందరో కళాకారులు సినీ రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారన్నారు. అమరావతి రాజధానిగా కళలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామగ్రామాల నుండి తప్పెటగుళ్లు, బుర్రకథ, హరికథ, ఇతర కళాబృందాలను ప్రోత్సహించి పెద్దఎత్తున కార్యక్రమం చేపడితే బాగుంటుందని సూచించారు. గ్రామాల్లో పశువులను మేపుకునేవారు సైతం ‘చెల్లియో.. చెల్లకో’ అంటూ పాడుతూ కళారాధన గొప్పతనాన్ని చాటిచెప్పారన్నారు. గ్రామాల్లో కళారంగాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు.
అనంతరం ప్రముఖ నృత్య కళాకారులు రాజా, రాధారెడ్డి దంపతులు, కుమారి భావన చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామం నుండి స్వయంకృషితో పైకెదిగిన రాజా, రాధారెడ్డి ఎన్నో సన్మానాలు, గౌరవాలు పొందారని యార్లగడ్డ కొనియాడారు. క్యూబా, అమెరికా వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారని, దేశ విదేశాలవారు ముచ్చటపడి ఈ కళాకారులను పిలుపించుకుంటారన్నారు. నాట్యకళా విన్యాసంతో భారతదేశ ఘనతను చాటిచెప్పిన కళాకారులు సర్వదా అభినందనీయులన్నారు. వీరు నాట్యం చేస్తుంటే సాక్షాత్తు శివపార్వతులే తాండవమాడుతున్నట్లుగా ఉంటుందని, కళారంగంలో వీరు దేశానికే వనె్నతెస్తూ కూచిపూడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. మేకప్ గురించి సురభి రఘునాథ్ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం నూనె, ఆముదాలలో నామసుద్ద, ఆకులు, అలములు సానరాయిపై అరగదీసి మేకప్ వేసుకునేవారన్నారు. బొగ్గుపొడి ఆముదంలో కలిపి మీసాలు, గడ్డాల కోసం కొబ్బరిపీచును ఉపయోగించేవారన్నారు. అప్పట్లో ఎవరికి వారే మేకప్ వేసుకోవడం వల్ల చాలా సమయం పట్టేదన్నారు. కాలక్రమంలో మేకప్ కోసం ఎన్నో రంగులు వచ్చాయన్నారు. అది ఒక పరిశ్రమగా తయారై కళాకారులకు మేకప్ సులభతరమయిందని వివరించారు. కూచిపూడి అనాదిగా వస్తున్న నాట్యసంపద అని చెప్పారు.

చిత్రం..కూచిపూడి నృత్య సమ్మేళనంలో నాట్య ప్రదర్శనతో అలరించిన కళాకారిణులు