రాష్ట్రీయం

మే 7న నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో చేరేందుకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను వచ్చే ఏడాది మే 7వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 23 వ తేదీ వరకూ గడువు విధించారు.
ఇంగ్లీషు , హిందీ భాషలతో పాటు ఈసారి తెలుగు, గుజరాతీ, మరాఠీ, బెంగాలి, అస్సామి, తమిళ భాషల్లో కూడా నీట్‌ను నిర్వహించనున్నారు. అఖిల భారత కోటాలో అడ్మిషన్లు చేపడతారు. మేనేజిమెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలకు సైతం రానున్న రోజుల్లో నీట్ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గత ఏడాది నీట్-2ను జూలై 24న నిర్వహించారు. వాటి ఫలితాలను ఆగస్టు 16న ప్రకటించారు. అడ్మిషన్ల ప్రక్రియను సెప్టెంబర్ 12 నాటికి పూర్తి చేశారు.
అయితే ఈ ఏడాది ఈ ప్రక్రియను మరింత ముందుగానే పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో ఈ పరీక్షను ఎఐపిఎంటి పేరుతో నిర్వహించేవారు.