రాష్ట్రీయం

ఆంధ్రాకు అదనంగా బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న రోజుల్లో అదనంగా బస్సులను నడుపుతామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు, లారీల రవాణాకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన వెల్లడించారు. వి శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సోమవారం నాడు శాసనసభలో సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్లాట్‌ఫారంలలో, ఇతర ప్రధాన బస్సు స్టేషన్లలో బస్సులను అనుమతించడం లేదనే విషయం వాస్తవం కాదని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రాంతాలకు టిఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోందని అన్నారు. సెలవులు, పండుగల సమయంలో రెగ్యులర్ సర్వీసులను అధిక సంఖ్యలో నడుపుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల బస్సుల కంటే దూర ప్రాంత బస్సులకు లాభాలు వస్తున్నాయని, దీనివల్ల సంస్థ నష్టాలు తగ్గుతున్నాయని మంత్రి చెప్పారు. కాంట్రాక్టు క్యారేజీ, స్టేజ్ క్యారేజీలకు విరుద్ధంగా బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రాలో తెలంగాణ బస్సుల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో 306 బస్సులను ఆంధ్రాకు నడపనున్నామని కూడా మంత్రి చెప్పారు.