రాష్ట్రీయం

తెలుగు చరిత్రకు సాక్షీభూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 26: శాతవాహన వంశానికి చెందిన 23వ చక్రవర్తిగా బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెలుగుజాతి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ వెయ్యి రోజులకు పైగా ఆడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఉత్సవం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ క్రీడామైదానం వేదికగా సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిడిని ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే గౌతమీపుత్ర శాతకర్ణి వెయ్యి రోజులకు పైగా ఆడుతుందని, ఆడాలని ఆదిశగా తెలుగువారందరూ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. తెలుగువారి పూర్వ వైభవాన్ని చాటే చరిత్ర కలిగిన శాతకర్ణి చిత్రం ఆ రికార్డులను బద్దలు కొడుతుందని తనకు పరిపూర్ణమైన విశ్వాసం చంద్రబాబు అన్నారు. బాలకృష్ణ తన వందో చిత్రంగా నటించడానికి ఎన్నో కథలు విన్నారని దర్శకుడు క్రిష్ తెలిపారన్నారు. ఆ సమయంలో రాష్ట్ర విభజన జరగడం, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనిసమయంలో అమరావతి పేరుతో నిర్మించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర రాజధానికి ఏపేరు పెడితే బాగుంటుందని ఆలోచించి సలహా ఇచ్చారన్నారు. ఆ సమయంలో రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీరావు తనకు ప్రతిపాదన పంపారని, ఆ పేరును అందరూ ముక్త కంఠంతో అంగీకరించారని బాబు తెలిపారు. 60 సంవత్సరాలు కష్టపడిన తరువాత విభజనతో తిరిగి అమరావతికి వచ్చామన్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి యాదృచ్చికంగా జరుగుతుంటాయన్నారు. ఈక్రమంలో తాను, సిఎస్ లండన్ వెళ్లామనన్నారు. అక్కడ మ్యూజియం చూశామన్నారు. తాను వెళ్ళినప్పుడు ఆ మ్యూజియంలో గ్రీస్ గ్యాలరీ, మరొకటి అమరావతి గ్యాలరీ అన్నారు. అమరావతి రాజధానిగా భారతదేశం నుంచి విదేశీయులు వ్యాపార లావాదేవీలు నడపండంతో తాము ప్రాధాన్యత ఇచ్చి అమరావతి గ్యాలరీ ఏర్పాటుచేశామని అక్కడి అధికారులు తెలిపారన్నారు. కాలగమనంలో ఎందరో రాజులు,నాయకులు వచ్చారని ఆయితే శాశ్వతంగా గుర్తుపెట్టుకోవలసిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరు తమ పేరుముందు ఇంటి పేరునో, తండ్రి పేరునో పెట్టుకుంటారని అన్నారు. అయితే శాతకర్ణి తల్లికి, మహిళలకు గౌరవం ఇవ్వాలని తనతల్లి పేరును తనపేరు ముందు పెట్టుకుని నూతన ఒరవడిని సృష్టించారన్నారు. ఇక నేటి రాజకీయ చరిత్రలో తెలుగువారి ఆత్మ గౌరువాన్ని విశ్వవ్యాపితం చేసి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఘనత ఎన్ టి ఆర్‌కే దక్కిందన్నారు. ఆనాడు చరిత్రలో శాతకర్ణి నిలిచారన్నారు. ఏసుక్రీస్తు జన్మించాక ప్రపంచంలో క్రీస్తుశకం ప్రారంభమైందని అన్నారు. క్రీస్తుశకం వచ్చిన తరువాత 70 సంవత్సరాలు శాలివాహనశకం ప్రారంభమైందని సి ఎం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మారిష్, బాలీ లాంటి దేశాల్లో కూడా ఉగాది జరుపుకుంటున్నామని అదే మనకు నూతన సంవత్సరం, శాలివాహన శకం అన్నారు. ఇంత ఘన చరిత్ర కలిగిన శాతకర్ణి చిత్రంలో బాలకృష్ణ వందో చిత్రంగా నటించే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఈ చిత్రం నిర్మాణంతో తనముందు ఒక సవాల్ ఏర్పడిందని అమరావతిని ఇంతకన్నా గొప్పగా నిర్మించాల్సిన బాథ్యత తనపై ఉందని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్ర ప్రభోదించేవిధంగా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నానన్నారు. విజ్ఞానం ప్రబోధించేలా సినిమా ఉండాలన్నారు. తాను ఏ సినిమా ఫంక్షన్లకు పోనని, అయితే ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధంతో ఆయన కుమారుడు నటించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చానన్నారు.

చిత్రం..తిరుపతిలో జరిగిన గౌతమీపుత్ర శాతకర్ణి
ఆడియో విడుదల వేదికపై కేంద్రమంత్రి వెంకయ్యతో కరచాలనం చేస్తున్న ఏపి సిఎం చంద్రబాబు.