రాష్ట్రీయం

రూ.3,920 కోట్లు మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు గతంలో తీసుకున్న 3,920 కోట్ల రూపాయల రుణ బకాయిలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి ఆ తర్వాత రాజీవ్ గృహకల్ప రుణాలను కూడా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శాసనసభలో మంగళవారం బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జరిగిన లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.
అంతకుముందు ఈ అంశంపై బిజెపి సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలు తమకోసం నిర్మించిన ఇళ్లకు గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయగా ఈమేరకు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. బలహీన వర్గాల ఇళ్ల కోసం ప్రభుత్వం పెద్దయెత్తున డబ్బు ఖర్చు చేస్తున్న క్రమంలో వీటికోసం గతంలో రుణాలు తీసుకున్నది కూడా పేదలే కావడంతో వారి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇళ్లు పొందిన వారి రుణాలను కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు గతంలో పేద ప్రజలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిని కోరాలని అనుకున్నామని అంతలోనే ఆయన ప్రకటన చేశారన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉదారంగా చేసిన ప్రకటనకు కాంగ్రెస్ తరఫున అభినందనలు చెబుతున్నామన్నారు. బిజెపి సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తాను చేసిన డిమాండ్‌పై వెంటనే స్పందించి పేదల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇళ్లకు తమ వాటా చెల్లించడానికి బలహీనవర్గాల ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, వారి ఇళ్ల పత్రాలు బ్యాంకులలోనే ఉండిపోయాయని లక్ష్మణ్ గుర్తు చేశారు. రుణ మాఫీకి సంబంధించిన ఇళ్ల పత్రాలను నెల రోజులలో వెలికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.