రాష్ట్రీయం

నీటి వనరుల నిర్వహణకు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌పితో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు ఉత్తమ భౌగోళిక విధానాలను అమలు చేసేందుకు ఇస్రో, రిమోట్ సెన్సిం గ్ ఏజన్సీతో అవగాహన ఒప్పందం ఖరారు చేసినట్లు భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అల్లా వెంకటేశ్వరరెడ్డి, హన్మంత్ షిండే తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ నీటి వనరుల సమాచార వ్యవస్థను అభివృద్ధికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. భారీ మధ్యతరహా సాగునీటి వ్యవస్థలు, చిన్నతరహా సాగునీటి వ్యవస్థ, నదీ పరివాహక వ్యవస్థ, ఆ ప్రాంతాల సమాచారం, హైడ్రోమెట్ డేటా వివరాలను పొందుపరుస్తున్నామనన్నారు. నీటి లభ్యతను పట్టి పంట విధానంపై రైతులకు సలహా ఇచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.