రాష్ట్రీయం

నేతలతో నరుూం బంధంపై ఆధారాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: రాజకీయ నేతలతో గ్యాంగ్‌స్టర్ నరుూంకు సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ హైకోర్టుకు గురువారం అఫిడవిట్ సమర్పించింది. నరుూంను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా ఎలాంటి రుజువులు లభించలేదని హోంశాఖ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని నక్సల్ సంస్థలతో నరుూంకు సంబంధాలున్నట్లు కూడా ఆధారాలు లభించలేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. సిపిఐ నేత కె నారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నరుూం ఉదంతంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని నారాయణ పిల్‌లో అభ్యర్థించారు. పాకిస్తాన్‌లో ఉన్న దావూద్‌ఇబ్రహీం ముఠాతో కూడా నరుూమ్‌కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఒక వేళ పైన పేర్కొన్న వారితో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే సిట్ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. సిఆర్‌పిసి సెక్షన్ల కింద టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. అలాగే రిటైర్డ్ అదనపు ఎస్పీ సిహెచ్ రవీందర్ రెడ్డి, ఏసిపి సీతారాం, ఇన్‌స్పెక్టర్లు బి కిషన్, పి శ్రీనివాసనాయుడు, జె నరేందర్ గౌడ్, బలవంతయ్య, మహమ్మద్ మజీద్, రవి కిరణ్ రెడ్డి, ఇ రవీందర్, శ్రీనివాస్, కె వెంకటరెడ్డిని సిట్ బృందం విచారించిందన్నారు. నక్సల్స్ సమాచారం కోసం నరుూమ్‌కు ప్రభుత్వం రూ.25 లక్షల నగదు ఇచ్చిందనే అభియోగంపై పిటిషనర్ ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదన్నారు. సిట్ బృందం నిష్పక్షపాతంగా దర్యాపు చేస్తోందన్నారు. సిట్ కంటి తుడుపు చర్యగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వచ్చిన అభియోగాల్లో నిజంలేదన్నారు. నరుూమ్‌పైన 167 కేసులు నమోదయ్యాయని, ఎనిమిది పాత కేసులను కూడా మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 848 మంది సాక్షులను ఇప్పటివరకు విచారించామన్నారు. మరో 217 మంది సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. దర్యాప్తు వివిధ దశల్లో పురోగతిలో ఉందని, చార్జిషీట్లను దాఖలు చేస్తున్నట్లు చెప్పారు.