రాష్ట్రీయం

ఇంటర్ లేకున్నా నేరుగా డిగ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇంటర్మీడియట్ లేకున్నా నేరుగా డిగ్రీలో చేరేందుకు బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర విద్యార్ధులకు అవకాశం కల్పిస్తోంది. కేవలం 17 ఏళ్ల వయస్సు నిండిని వారు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా నేరుగా డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో వచ్చే ఫిబ్రవరి 16 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 26న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత పరీక్ష రాసేందుకు సమీపంలోని ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని గుర్తించి అక్కడికి అన్ని ధృవపత్రాలతో వెళ్లాలని, ఫోటో, సంతకం, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని యూనివర్శిటీ ప్రతినిధి చెప్పారు. ఇతర వివరాలకు బిఆర్‌ఎఓయుఆన్‌లైన్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని వారు సూచించారు.
మే 28న ఎయిమ్స్ ప్రవేశపరీక్ష
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)లో ఎంబిబిఎస్ యుజి కోర్సులో ప్రవేశానికి 2017 మే 28న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను జూన్ 14న ఫలితాలను ప్రకటిస్తారు. జూలై 3 నుండి కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. ఎయిమ్స్ ప్రవేశపరీక్ష తాత్కాలిక షెడ్యూలును సంస్థ శుక్రవారం నాడు ప్రకటించింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత తొలి కౌనె్సలింగ్ జూలై 3న ప్రారంభమై 6వ తేదీ వరకూ జరుగుతుంది, రెండో దశ కౌనె్సలింగ్ ఆగస్టు 3న జరుగుతుంది, మూడో దశ కౌనె్సలింగ్ సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించి, ఓపెన్ కౌనె్సలింగ్ సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు ఎయిమ్స్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
మే 7న కర్నాటక ఉమ్మడి ప్రవేశపరీక్ష
కర్నాటక ప్రైవేటు వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో యుజి కోర్సుల్లో ప్రవేశానికి మే 7న ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. కాన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ , డెంటల్ కర్నాటక కోమెడ్-కె పేరిట ఈ పరీక్షను నిర్వహించనుంది. కర్నాటక రాష్ట్రంలోని 150 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను కోమెడ్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లను అభ్యర్ధులు నీట్ రాయాల్సి ఉంటుంది.