రాష్ట్రీయం

వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 4: రాష్ట్రాన్ని 2020 నాటికి భారతదేశంలో మూడవ రాష్ట్రంగాను, 2029నాటికి భారతదేశంలో నెంబర్‌వన్‌గాను, 2050నాటికి ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జన్మభూమి -మాఊరు కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరుస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదవారిని అభివృద్ధిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రం నాకుటుంబం అని మీ జీవితాల్లో వెలుగులు చూడాలనేదే తన ఆకాంక్ష అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల గుండెల్లో నిలవాలని ఉందన్నారు. జన్మభూమి కార్యక్రమంపై కొంతమంది నిరంతరం పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారని తాను అనుకున్న పనిని మొండిగా చేస్తానని ఆయన ప్రతిపక్షాలకు చురకలంటించారు. పదవుల్లో ఉంటే పిల్లలు చదవులకు దూరంగా ఉంటారని, కాని తన కుమారుడు మాత్రం అమెరికాలోని మంచి యూనివర్శిటీలోచదివించానని, తన కోడలుకూడా అమెరికాలోనే చదివిందని, వారు తనమీద ఆధారపడరన్నారు. చదువుఉంటే సంస్కారం ఉంటుందని ఆయన తన కుటుంబాన్ని ఉదహరించారు. రాష్టవ్య్రాప్తంగా నదుల అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలుగొండప్రాజెక్టు నిర్మాణానికి తానే శంకుస్ధాపన చేశానని, తానే పూర్తిచేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. వెలుగొండప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయితే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటిని తీసుకువెళ్ళవచ్చునని ఆయన పేర్కొన్నారు. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చుకుంటే రైతుల జీవితాలు బాగుపడ్తాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయాన్ని లాభాసాటిగా చేస్తున్నామన్నారు. రైతులు వ్యవసాయంతోపాటు గొర్రెలపెంపకం, పాడిపరిశ్రమ, చేపల పెంపకం లాంటివి చేపట్టి ఆర్ధికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. ఫిబ్రవరి ఒకటవతేదీనుండి అన్ని హాస్పటల్స్‌లో ఎన్‌టిఆర్ వైద్య సేవల ద్వారా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు వైద్యశాలల్లోను రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాదులోని అధికారులందరు జూన్‌లోపల రావాలన్నారు. అధికారులకు తాత్కాలిక్ సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక అడ్డంకులు, సమస్యలు ఉన్నాయని ధైర్యంగా ముందుకు పోతే అనుకున్న లక్ష్యం నేరవెరుతుందన్నారు. రైతులకు, డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్ధాయిలో అమలుచేస్తున్నామని తెలిపారు.

విద్యార్థులతో జన్మభూమి సభ
కాగా ముఖ్యమంత్రి నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమశాఖలకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయంనుండి మధ్యాహ్నం వరకు విద్యార్థులు జన్మభూమి సభకే పరిమితం అయ్యారు. ఈ ఘటన విమర్శలకు తావిచ్చింది. కాగా ముందుగా జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో నాయకులు అధికారుల చేత ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు.

మార్కాపురం మండలం రాయవరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు