రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 3: ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారి దర్శనార్థం గవర్నర్ పి ఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలైన ఇస్తికపాల్‌తో స్వాగతం పలికారు. టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఒ సాంబశివరావు, జె ఇ ఓ శ్రీనివాసరాజులు ప్రధాని, సి ఎం, గవర్నర్‌లను సాదరంగా ఆహ్వానించి ఆలయంలోకి తీసుకువెళ్లారు. సుమారు పది నిమిషాల పాటు ప్రధాని మోది శ్రీవారి మూల విరాట్టును దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణదీక్షితులు స్వామివారి వైభవాన్ని,పంచబేర విగ్రహాల విశేషాలను, ఆలయ, స్వామివారి ఆభరణాల విశిష్టతను వివరించారు. ఈసందర్బంగా ప్రధానికి టిటిడి తరపున స్వామివారి శేష శస్త్రాన్ని మర్యాద పూర్వకంగా బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ గవర్నర్, సి ఎం వెంటరాగా స్వామివారి మాతృమూర్తి అయిన వకుళామాతను దర్శించుకున్నారు. అక్కడ నుంచి ఆనంద నిలయ ప్రాకారానికి ప్రదక్షణగా వచ్చి ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి ప్రధాని శ్రీవారి హుండీలో కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం ధ్వజస్థంభాన్ని నమస్కరించుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. ఈసందర్భంగా వేదపండితులు ప్రధాని, గవర్నర్, సి ఎంలకు వేదాశీర్వచనం చేశారు.
వేద పండితులు ఆశీర్వచనం పలుకుతున్నంత సేపుప్రధాని ముకుళిత హస్తాలతో నమస్కరించుకుంటే ధ్యాన ముద్రలో గడిపారు. రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పొందిన అనంతరం రాష్టప్రతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రుల చేత ఎస్వీబిసి చానల్ ద్వారా సందేశం ఇచ్చే ఆనవాయతీని టిటిడి పాటిస్తోంది. అలాగే ప్రధాని నరేంద్రమోదీ కూడా సందేశం ఇమ్మని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు ఆహ్వానించారు. ఇందుకు ముందుకు రెండడుగులు వేసిన ప్రధాని సందేశం ఇవ్వాలని అధికారులు కోరడంతో సున్నితంగా నమస్కరించి ఆయన ఆలయం వెలుపలికి వచ్చారు.
అనంతరం టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. గవర్నర్ ముఖ్యమంత్రులకు కూడా తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జె ఇ ఓ శ్రీనివాసరాజు, టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలో రంగనాయక మండపంలో ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్,
ఏపి సిఎం చంద్రబాబులకు వేదాశీర్వచనం చేస్తున్న పండితులు