రాష్ట్రీయం

ఆస్తుల స్వాధీనం హక్కు మాకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: అవినీతి నిరోధకచట్టం, మనీ లాండరింగ్ చట్టం కింద జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) హైకోర్టుకు తెలిపింది. దీనిపై సంబంధిత కోర్టు ధ్రువీకరించి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఇడి తెలిపింది. ఇడి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ బుధవారం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ, కోర్టు ధ్రువీకరించిన వెంటనే జప్తుచేసిన ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకునే హక్కును కలిగి ఉంటుందన్నారు. భారతి సిమెంట్స్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇడి దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు విచారించింది. భారతి సిమెంట్స్ సంస్థల ఆస్తులు వైఎస్ జగన్ కుటుంబానికి చెందినవన్న సంగతి విదితమే. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇడి తమ అకౌంట్లలోకి బదలాయించిన సంగతిని ఇడి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసుపై వాదనలు గురువారం కూడా కొనసాగుతాయని హైకోర్టు ప్రకటించింది.