రాష్ట్రీయం

రేషన్ కొండెక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 6: ఈ-పాస్ కష్టాలు జనాన్ని వెంటాడుతున్నాయి. సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో నిత్యావసరాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రేషన్‌దుకాణాల ముందు జనం పడిగాపులు కాయాల్సివస్తోంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎ.రొప్పం గ్రామంలోని రేషన్ డీలర్ భీమక్క ఈ-పాస్ సిగ్నల్ కోసం జనాన్ని ఏకంగా సమీపంలోని కొండపైకి తీసుకువెళ్లి అక్కడే వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేసిన వైనం...రేషన్ కష్టాలు కళ్లకు కట్టేదిలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి మాసం నుండి రేషన్‌కార్డు వినియోగదారులకు నగదు రహిత లావాదేవీల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. అయితే గత ఆరు రోజులుగా స్థానికంగా ఈ-పాస్ యంత్రాల్లో సిగ్నల్స్ రావడం లేదు. బ్యాంక్ ఖాతా వివరాలు వచ్చే సమయంలో యంత్రాలు నిలిచిపోతుండటంతో ఎక్కడా 20 శాతం సరుకులు కూడా పంపిణీ కాలేదు. కొంతమంది డీలర్లు రాత్రి 10 గంటల తర్వాత చౌక దుకాణాలు తెరచి సిగ్నల్స్ కోసం ఎదురుతెన్నులు చూసి, సరుకులు పంపిణీ చేస్తున్నారు. మడకశిర మండలం ఎఆర్ రొప్పం గ్రామంలోని రేషన్ దుకాణంలో శుక్రవారం ఈ పాస్ యంత్రం సిగ్నల్స్ అందక మొరాయించింది. దీంతో రేషన్ డీలర్ భీమక్క గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైకి చేరుకుని చూడగా అక్కడ సిగ్నల్ వచ్చింది. దీంతో కార్డుదారులంతా పొలోమంటూ కొండెక్కారు. అక్కడే ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి బిల్లు చెల్లించారు. అనంతరం కొండ దిగివచ్చి దుకాణంలో సరుకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్డుదారులు రంగమ్మ, గంగమ్మ, తిప్మమ్మ, నాగరత్నమ్మ, అలివేలమ్మ మాట్లాడుతూ కొత్త నిబంధనతో దుకాణాల వద్ద గంటల తరబడి నిలుచోవాల్సి వస్తోందన్నారు. ఈరోజు ఏకంగా కొండ ఎక్కాల్సి వచ్చిందన్నారు.

చిత్రం..కొండపైన కార్డుదారుల నుంచి వేలిముద్రలు తీసుకుంటున్న రేషన్ డీలర్