రాష్ట్రీయం

అభివృద్ధిలో సమన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: పారిశ్రామిక అభివృద్ధిపై సమగ్ర విధానం అమలు చేస్తామని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈమేరకు ఆయన శుక్రవారం శాసనసభలో ప్రకటన చేస్తూ, పారిశ్రామిక ప్రగతిపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తామని, ఐటి, ఐటిఇఎస్, టెక్స్‌టైల్, లెదర్, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు వీలు కల్పిస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియ మొదలైందని, అయితే, వృద్ధి ఒకవైపే కేంద్రీకృతం కాకుండా చూస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరం ఫార్మాకు పెట్టింది పేరని అంటూ, దేశంలో 40 నుంచి 45 శాతం ఔషధాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఐడిపిఎల్ కారణంగా ఫార్మా వృద్ధి సాధించినా, కాలుష్యం సైతం పెరిగిందన్నారు. చౌటుప్పల్, కొత్తూరువంటి ప్రాంతాల్లో ఫార్మా కాలుష్క నివారణ అధ్యయనానికి ఉన్నతాధికారుల కమిటీని నాలుగైదు దేశాలు పంపించినట్టు వెల్లడించారు. ఆ కమిటీ నివేదికలు అందిన నేపథ్యంలో, కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ఫార్మా సిటీ ప్రణాళిక నిర్ణయించినట్టు చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో కాలుష్య నివారణకు ప్రయత్నించి 60 కోట్లు వెచ్చించినా ఫలితం లేకపోయిందన్నారు. వరంగల్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామని, హైదరాబాద్ చుట్టూ 335 కిలోమీటర్లు పొడవునా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధిపై సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడించారు.
వచ్చే ఏడాదే టెక్స్‌టైల్ పార్కు
వచ్చే ఏడాదిదే మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రారంభిస్తామని ఐటి మంత్రి కెటిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మెదక్‌లో జాతీయ పెట్టుబడి తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాతీయ పెట్టుబడి కారిడార్ అభివృద్ధి ట్రస్టులో హైదరాబాద్ -వరంగల్ కారిడార్ చేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ కారిడార్‌ను మూడు క్లస్టర్లుగా ప్రతిపాదించామన్నారు.
యాదగిరి క్లస్టర్‌లో ఐటి, ఐటిఇఎస్, మెడికల్ హబ్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్, రవాణా హబ్ ఉంటాయన్నారు. జనగాం క్లస్టర్‌లో ఖనిజ ఆధారిత, ఆహార ప్రాసెసింగ్, తోళ్ల సంబంధిత యూనిట్లు వస్తాయన్నారు. వరంగల్ క్లస్టర్‌లో ఐటి, ఐటిఇఎస్, జౌళి పార్కు, వ్యవసాయాధారిత, విద్యాపరమైన క్లస్టర్లు ఏర్పాటవుతాయని వివరించారు.