రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో 50వేల ఆర్జిత సేవా టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 6: తిరుమల శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవ టిక్కెట్లను ఏప్రిల్ నెలకు గాను దాదాపు 51వేల టిక్కెట్లును ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్టు టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్‌యువర్ ఇఓ కార్యక్రమం జరిగింది. అంతకుముందు ఆయన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు భక్తులకు 50,974వేల టిక్టెట్లను ఇంటర్నెట్‌లో విడుదల చేసి నట్లు తెలిపారు. ఇందులో సుప్రభాతం 6,299వేలు, అర్చన 120, తోమాల 120, విశేష పూజ 1125, అష్టదల పాదపద్మారాధన 80, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం, 10,125వేలు, వసంతోత్సవం 10,750వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805 వేలు, సహస్రదీపాలంకరణ సేవ 12,350వేలు, ఊంజల్ సేవ 2700 టిక్కెట్లను ఇంటర్నెట్‌లో ఉంచామన్నారు. త్వరలోనే ఎక్కువ మంది భక్తులకు ఆర్జిత సేవల బుకింగ్‌లు అందుబాటులో తెచ్చేందుకు మొబైల్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కె. సముద్రం కు చెందిన రవీందర్ అనే భక్తుడు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని అటు తరువాత శ్రీవారిని దర్శించుకునేలా క్యూలైన్ల వరుసలను ఏర్పాటుచేయాలని, తిరుపతిలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిస్తే బాగుంటుందని కోరారు. ఇ ఓ మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కడపకు చెందిన కిరణ్‌కుమార్ అనే భక్తుడు మాట్లాడుతూ 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని, వెండివాకిలి వద్ద తోపులాటను అరికట్టాలని కోరారు.