రాష్ట్రీయం

అమరావతికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: వివిధ ప్రాంతాల అభివృద్ధిలో శ్రీలంక ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు, నమూనాలు కొన్ని అమరావతికి సారూప్యంగా ఉండటంతో వాటి తీరుతెన్నులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా పరిశీలించారు. కొలంబో పరిసరాల్లో బహుముఖీనంగా చేసిన అభివృద్ధిపై దృష్టిపెట్టిన చంద్రబాబుకు శ్రీలంక ప్రభుత్వం అక్కడి ప్రణాళికలను వివరించింది. శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో పేదరిక నిర్మూలనపై ప్రసంగించాల్సిందిగా అందిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి శని, ఆదివారాలు కొలంబో పర్యటనకు వెళ్లారు. సిఎంతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం ఆసక్తి కనబర్చింది. పర్యాటక, గృహ నిర్మాణ, హోటళ్లు వంటి రంగాల్లో శ్రీలంక పశ్చిమ ప్రాంత అభివృద్ధి శాఖ అమలుచేస్తున్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక మెగా పోలీస్, పశ్చిమప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి పటలీ చంపిక రణవాక అధికారులతో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. మొత్తం దేశ భూభాగంలో కేవలం 6 శాతం మాత్రమే వున్న పశ్చిమ ప్రాంతంలో 28 శాతం జనాభా నివసిస్తోంది. నది, సెలయేరు, సముద్రం.. మూడూ కలిసి ఆకర్షణీయంగా ఉండే ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయ సంకల్పించామని ఆ దేశ మంత్రి రణవాక చంద్రబాబుకు వివరించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిపై దృష్టి సారించామని, వివిధ ప్రభుత్వ సేవల్లో ఎలక్ట్రానిక్ పాలనా విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు, రియల్ టైం పాలన దిశగా ముందడుగు వేశామని, ఇవి మంచి ఫలితాలిస్తున్నాయని శ్రీలంక మంత్రి చెప్పారు. వీటన్నిటితో కూడిన మాస్టర్ ప్లాన్ ఈ అభివృద్ధి కార్యక్రమంలో కీలకమని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలతో దీన్ని అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వ్యాపారపరంగా విశాలమైన ఓడరేవు, ఆర్థికాభివృద్ధికి దోహదపడే వౌలిక సౌకర్యాలు ఈ పశ్చిమ ప్రాంతానికి వరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నా సంకల్పబలంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధికి శ్రీలంక పశ్చిమ ప్రాంత అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను కూడా పరిశీలిస్తామని వారికి ఆయన తెలిపారు.

చిత్రం..అభివృద్ధి ప్రణాళికలపై శ్రీలంక మంత్రితో చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు