రాష్ట్రీయం

హైదరాబాద్‌కు నృత్యశోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నాట్యశోభను సంతరించుకుంటోంది. ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటలకు మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ‘అంతర్జాతీయ టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్’ జరగబోతోంది. ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఎబిసి), ప్రసారభారతి, తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక రంగానికి హైదరాబాద్ పెట్టింది పేరుకావడంతో ఈ కార్యక్రమం కోసం కళాపిపాసులంతా ఎదురుచూస్తున్నారు. మాల్దీవులు, అఫ్గానిస్తాన్, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కంబోడియా, ఫిజీ, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన నాట్యరంగ కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన యువత మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలన్నదే ఈ ఫెస్టివల్ ఉద్దేశం. నాట్యబృందాల ఎంపికకు ప్రసారభారతి గత ఏడాది జూన్ నుండి కసరత్తు చేస్తోంది. 453 ఎంట్రీలు రాగా, వడపోసిన తర్వాత 29 ఎంట్రీలను ఎంపిక చేశారు. ఈ బృందాలే ఈ నెల 15న ప్రదర్శనలు ఇస్తున్నాయి. డిడి ఇండియా, డిడి భారతి, డిడి ఉర్దూ, డిడి సప్తగిరి, డిడి యాదగిరిలలో కార్యక్రమాల ప్రారంభం నుండి చివరి వరకు ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ప్రసారభారతి చైర్మన్ డాక్టర్ ఎ.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొంటున్నారు.