రాష్ట్రీయం

క్యాష్‌లెస్ విధానంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 13: పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్లకు ఇబ్బందులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో విద్యుత్ వినియోగదారులు బిల్లుల చెల్లింపుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నాన్ని ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించింది. నగదుకోసం ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు స్వైపింగ్ మిషన్ల ద్వారా బిల్లుల చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం వరంగల్ నగరంలోని హన్మకొండ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి గోపాలరావువిద్యుత్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన స్వెపింగ్ మిషన్లను లాంఛనంగా ప్రారంభించి నగదు రహిత చెల్లింపులకు వీలుకల్పించారు. వరంగల్ నగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు నగదురహిత విధానంలో బిల్లులు చెల్లించేలా 25 స్వైపింగ్ మిషన్లను లీడ్‌బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ సహకారంతో ఏర్పాటు చేసారు. త్వరలో 400 స్వైపింగ్ మిషన్లు ఎన్‌పిడిసిఎల్ పరిధిలోని పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అందచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట జిల్లా ప్రధాన కేంద్రాలలో స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత విడతలవారీగా అన్ని మండల కేంద్రాలకు ఈ సదుపాయం విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్ణయం మేరకు నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎన్‌పిడిసిఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోందని సంస్థ సిఎండి గోపాలరావు తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా తమ నెలవారీ కరెంటు బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. ఈ సదుపాయం వల్ల చిన్ననోట్ల, చిల్లర సమస్యలు తొలుగుతాయని అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌పిడిసిఎల్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు తిరుపతిరెడ్డి, సదర్‌లాల్, వరంగల్ సర్కిల్ ఎస్‌ఇ శివరాం, టెక్నికల్ విభాగం డివిజనల్ ఇంజనీర్ శ్రీకాంత్, నగర డిఇ సామ్యానాయక్, ఎస్‌బిహెచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ అరుణ్ పాల్గొన్నారు.

చిత్రం..హన్మకొండ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లను
ప్రారంభిస్తున్న ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు