రాష్ట్రీయం

రావణ వాహనంపై ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆది దంపతులకు రావణ వాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఆశీనులను చేశారు. మహా మంగళహారతి అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గర్భాలయం మీదుగా ఆలయ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.