రాష్ట్రీయం

ఇక ప్రగతి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కనీసం రెండేళ్లపాటు ప్రాథమిక మిషన్‌ను మరీ ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధారం చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత వివిధ కారణాల వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారీ ఎత్తున కొనసాగించేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిశ్రమలు, ఐటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, వీటి ఫలితాలు వచ్చేందుకు కనీసం రెండు, మూడు సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు తొలుత ప్రాధాన్యత ఇస్తూ, ఈ రంగాల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేలా, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా ప్రణాళికలను రూపొందించారు. ప్రజల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉండటం గమనార్హం. పైగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత అత్యధికంగా కోస్తా జిల్లాల్లోనే ఉంటున్నాయి. ఏపి సమైక్య రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు మరీ ముఖ్యంగా వరి ధాన్యం ఉత్పత్తి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితిలో వ్యవసాయ రంగానికి గోరంత చేయూత ఇస్తే, కొండంత ఫలసాయం లభిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం రెండు మూడేళ్ల పాటు వ్యవసాయ ఉత్పత్తులే కీలక భూమిక పోషించాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
2014-15, 2015-16 సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రంగంలో గణనీయమైన ప్రగతి సాధ్యం కాలేదు. జిఎస్‌డిపికి 2014-15లో వ్యవసాయ రంగం ద్వారా 18.20 శాతం సమకూరగా, 2015-16 లో ఇది 27 శాతం ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని వచ్చే రెండు మూడేళ్లలో 30 శాతంపైగా తీసుకువెళ్లాలని ప్రణాళికలు రూపొందించారు. 2015-16లో జిఎస్‌డిపి 6,36,609 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనావేస్తుండగా, ఇందులో 1,65,000 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుంబంధ రంగాల ద్వారా లభిస్తుందని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరాల్లో దీన్ని 2,00,000 కోట్లకు చేర్చాలని ప్రణాళికలు రూపొందించారు.
వ్యవసాయ రంగంలో 2016-17 సంవత్సరానికి భారీ ప్రణాళికలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. 2015-16 సంవత్సరంలో ఈ రంగానికి 14 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించగా, రాబోయే సంవత్సరంలో దీన్ని 18 వేలకోట్ల రూపాయలకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలను సమకూర్చడానికి ఇప్పటి నుండే ఆర్థిక సంస్థలతో చర్చలు ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే పంటల ద్వారానే ఇది సాధ్యం కాదని ప్రభుత్వం నిశ్చయానికి వచ్చింది. వర్షాలు అతిగా కురిసినా, తక్కువ కురిసినా పంటల ఉత్పత్తి విపరీతంగా తగ్గిపోతోంది. ప్రస్తుత సంవత్సరం (2015-16) 134 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావాలని తొలుత భావించినప్పటికీ, ఈ లక్ష్యాన్ని చేరే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే అనుబంధ రంగాలైన పాడి, పశుగణాభివృద్ధి (మేకలు, గొర్రెల పెంపకం), కోళ్లు, చేపలు, రొయ్యల పెంపకం, పూలు, కాయగూరలు, పండ్ల తోటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా ఇప్పటికే దీనిని అమలు చేయడం ప్రారంభించారు. 2022 సంవత్సరం నాటికి దేశంలో అత్యధిక వ్యవసాయోత్పత్తులు సాధిస్తున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపిని చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత దేశంలో మొట్టమొదటి స్థానం ఏపిదే కావాలన్న లక్ష్యంతో ప్రణాళికను అమలు చేస్తున్నారు.
150 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు
రాష్ట్ర వ్యాప్తంగా 160 లక్షల హెక్టార్ల భూమి ఉండగా, ఇందులో 66 లక్షల హెక్టార్లలో పంటలు పండుతున్నాయి. వర్షపునీటి సంరక్షణ, భూగర్భ జలాలు, ఇతర జలవనరుల పెంపు, నీటి యాజమాన్యాన్ని మెరుగుపర్చుకోవడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 140 నుండి 150 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.
ప్రాథమిక మిషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ, 2016-17 నుండి వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.