రాష్ట్రీయం

శ్రీశైలంలో పూర్ణాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 16: సంక్రాంతి బ్రహోత్మవాల్లో భాగంగా శ్రీశైలంలో సోమవారం పూర్ణాహుతి నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, నిత్యహోమాలు, రుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. దేవస్థానం ఇఓ నారాయణగుప్తా, వేద పండితులు పూజాద్రవ్యాలను అగ్నిగుండానికి సమర్పించారు. దీంతో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. వసంతోత్సవంలో భాగంగా వసంతాన్ని భక్తులపై సంప్రోక్షణ చేశారు. చివరగా సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమం జరిగింది.