రాష్ట్రీయం

కోట్లకు కోట్లు దండుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతోన్న మోస్ట్‌వాంటెడ్ సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఇస్తానంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాడు బోజ్ ఆగస్టిన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టిన్‌ను సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మంగళవారం సాయంత్రం సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడు మధురైకు చెందిన బోజ్ ఆగస్టిన్ ఎనర్జి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం స్థలం చూపించి ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10శాతం పెట్టుబడి పెడితే 90శాతం పెట్టుబడి తానే పెడతానని ఆశావహులను ఆకర్షించే వాడు. పది శాతం తన ఖాతాలో జమ కాగానే సెల్‌ఫోన్ స్విచ్చ్ఫా తప్పించుకునే వాడు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి నర్సిరెడ్డి వద్ద కోటి రూపాయలు వసూలు చసి మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఓ ఎమ్మెల్యే సోదరుడి సహ పలువురి వద్ద నుంచి మరో రూ. కోటి వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాడు అగస్టిన్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సోలార్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు పేరుతో దాదాపు రూ. 150 కోట్లు మోసం చేశాడని సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తెలిపారు. అగస్టిన్ చేతిలో మోసపోయిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి నిరుడు అక్టోబర్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు.

చిత్రం..మోసగాడి వివరాలు వెల్లడిస్తున్న స్వాతి లక్రా, అవినాష్ మహతి