రాష్ట్రీయం

నేనేమీ పారిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: ఐదుగురి ప్రాణాలు బలిగొన్న కల్తీ మద్యం వ్యవహారంలో 9వ నిందితుడిగా ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి మంగళవారం లబ్బీపేటలోని తన ఇంటికి చేరుకున్నారు. డిసెంబర్ 7న మీడియా ముందు హాజరై కల్తీ మద్యంతో తనకు సంబంధం లేదని, తన కుటుంబ సభ్యుల్లో కొందరికి లైసెన్స్‌లు ఉన్నాయని వివరించారు.అయితే కూలింగ్ వాటర్‌లో కొందరు ఉద్దేశపూర్వకంగా విషం కలపటం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. ఆ మర్నాడు ఆయనను 9వ ముద్దాయిగా చేర్చడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తం 10 మంది ముద్దాయిల్లో తొమ్మిది మంది ఇప్పటికే అరెస్టయ్యారు. దాదాపు నెల రోజులుగా విష్ణు కోసం పోలీసులు తీవ్రంగా గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. విష్ణు పరారీపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరించటంతో గత్యంతరం లేని స్థితిలో ఆయన మంగళవారం ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను ఎక్కడకూ పారిపోలేదని, తీర్థయాత్రలకు వెళ్లానని, దీనికి సంబంధించి ముందుగానే రిజర్వేషన్లు కూడా చేసుకున్నామని చెప్పారు. తాను షిర్డీ, తిరుపతిలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను కూడా ఈ సందర్భంగా విష్ణు ఉదహరించారు. న్యాయస్థానం అంటే తనకెంతో గౌరవం ఉందంటూ, కోర్టు ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణు బుధవారం ఉదయం ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారుల ముందు హాజరుకాబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన న్యాయవాదులు సిట్ అధికారులను కలిసి ఏ సమయంలో హాజరుకావాలో అడిగి తెలుసుకున్నారు. విష్ణు చెప్పే కథనాన్ని సిట్ అధికారులు ఏమాత్రం విశ్వసించని పక్షంలో అరెస్ట్ చేసే అధికారాన్ని న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చింది. ఇది అన్ని పక్షాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.