రాష్ట్రీయం

ఎమ్మెల్యే అఖిలప్రియ కారుపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగారు. గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయానికి అఖిలప్రియ వెళుతుండగా మందడం మలుపు వద్ద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాన్వాయి ఎదురయింది. దీంతో గన్‌మెన్ దిగి సమీపంలో ఉన్న సిఐని హెచ్చరించారు. వైసిపి కార్యకర్తలు కారు వద్దకు చేరుకుని జెండా కర్రలతో, రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరకొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అఖిలప్రియ కారును మరోమార్గం గుండా వెనక్కు తిప్పిపంపారు. దీంతో ఆమె సచివాలయం లోపలకు వెళ్లకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. మంగళగిరి మండలం నిడమర్రులో గురువారం రైతులతో ముఖాముఖి అనంతరం జగన్ కాన్వాయ్‌కు చెందిన నాలుగు వాహనాలను మాత్రమే సచివాలయానికి అనుమతించారు. దీంతో మరోమార్గం గుండా కొందరు కార్యకర్తలు మందడం వద్దకు చేరుకున్నారు. మందడం మలుపు వద్ద సచివాలయానికి వెళ్లే మార్గంలోకి అఖిలప్రియ కారు ప్రవేశించగానే అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకుని దాడికి యత్నించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సచివాలయం రోడ్డులోని సిసి కెమేరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా అఖిలప్రియపై జరిగిన దాడిని టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. జగన్ తన తల్లి, చెల్లిని జైల్లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ప్రేరేపించి విడుదల కాగానే వారిని కరివేపాకు మాదిరి పక్కన పెట్టారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఖండించారు. శాసనసభ్యురాలనే గౌరవం కూడా లేకుండా వైసిపి కార్యకర్తలు రౌడీయిజం చలాయించడం దుర్మార్గమని ఎమ్మెల్యే వి.అనిత ఖండించారు. జగన్ సమక్షంలో దాడి జరిగినందున ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడి చేస్తున్న దృశ్యం (సిసిటివి ఫుటేజ్)