రాష్ట్రీయం

ఉగ్రవాది జకీర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించి గత కొనే్నళ్లుగా హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాద అనుమానితుడు సయ్యద్ జకీర్ ఎట్టకేలకు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అరెస్టయ్యాడు. రియాద్ పోలీసులు సయ్యద్ జకీర్‌ను ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు విమానంలో శుక్రవారం పంపించారు. బిజెపి నేతలను హత్య చేయాలనే కుట్ర కేసులో సయ్యద్ జకీర్ నిందితుడు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో జకీర్‌పై పదేళ్ల క్రితమే కేసులు నమోదయ్యాయి. పాక్‌లో తలదాచుకుంటున్న కరడుగట్టిన లష్కర్ తోయిబా నాయకుడు ఫర్హతుల్లా ఘోరికి సయ్యద్ జకీర్ బావమరిది. ఘోరి కూడా అనేక కుట్ర కేసుల్లో నిందితుడు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు.