రాష్ట్రీయం

ఆరునూరైనా సభ నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: కాపు సామాజిక వర్గం త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే ప్రయత్నాలను తిప్పిగొడతామని మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. కాపుల సభను జరగనివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు జాతి తిరగబడితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని, ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30 విధించినట్లు, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు పెట్టరాదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో కుల సమావేశాలను కాపుజాతి తప్ప ఎవరైనా పెట్టుకోవచ్చా, మీరు మీ కుల సభలు కోటీశ్వరులు, అపర కోటీశ్వరులతో తరచూ పెట్టుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘మా జాతి తాలిబన్, ఉగ్రవాదులు లాంటివారా? లేక ఏ దేశం నుంచి అయినా తరిమివేస్తే ఈ దేశానికి వచ్చిన వారా? మేము భారతదేశ పౌరులం కాదా? ఈ కరివేపాకు జాతి అంతరించి పోవాలని మీ జాతిలో కొందరి పెద్దల ఆరాటమా? మా జాతి వారు ఈ రాష్ట్రంలో పుట్టడం నేరమా? పిల్లలను కనడం కూడా నేరమా? భారత రాజ్యాంగంలో కాపు జాతి సభలు పెట్టుకోకూడదని ఆంక్షలు ఉన్నాయా? మీ జాతి వారు విదేశాల్లో మీ సహకారంతో కుల సభలు పెట్టుకోవడం లేదా’ అని ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికల సభల్లో మీరు ఇచ్చిన హామీలు గుర్తుచేయడం నేరమా? అమలు చేయమని అడగడం నేరమా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన హామీల అమలు కోసం కార్యాచరణ రూపకల్పనకు సభ పెట్టుకునే హక్కు మా జాతికి లేదా అని ముద్రగడ నిలదీశారు.
కాపుల్లో 95 శాతం జనాభా ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో కూరుకుపోయారని, పిల్లలను చదివించుకోలేని పరిస్థితులు ఉన్న కారణంగా ఉద్యోగాలు పొందే అవకాశం లేదన్నారు. ఎన్నికల సభల్లో బిసి రిజర్వేషన్లు, ఏటా వెయ్యికోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వామనమూర్తి బలిచక్రవర్తిని అభినందిస్తూ పాతాళానికి తొక్కినట్లుగా ఓట్లతో నెగ్గి వారిని మీ పాదాలతో అధఃపాతాళానికి తొక్కివేయాలనే ఆలోచన మహా ఘోరమన్నారు. ఎన్నో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో సభలు జరుపుకున్న సందర్భాల్లో లేని ఆంక్షలు 2016 జనవరి ఆఖరి వరకు పెట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఇది కయ్యానికి కాలు దువ్వడమా అని ప్రశ్నించారు. అన్ని జైళ్లను కాపులతో నింపినా, బెయిల్ కోరబోమని, తమ లక్ష్యాన్ని సాధించేవరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తిలేదని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. రాజ్యాంగం, చట్టాలు అన్ని కులాల కోసమని, కేవలం మీ కుటుంబాల కోసం తయారు చేయలేదన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో చేపట్టే ఉద్యమంలో తమ జాతికి చెందిన వారిపై పోలీసులు లాఠీ ఎత్తితే తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. లాఠీ ఎత్తినా, తుపాకీ ఎక్కుపెట్టినా పారిపోమన్నారు. సభకు అడ్డుతగలవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.