రాష్ట్రీయం

తక్షణం బ్రాహ్మణ సదన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా సొసైటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ఇప్పటికే స్థలం కేటాయించడంతో భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం బ్రాహ్మణ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్‌తో ముఖ్యమంత్రి సమీక్షించారు. బ్రాహ్మణుల సంక్షేమ నిధికి ఇప్పటికే ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ నిధులతో బ్రాహ్మణ సదన్, సంక్షేమం, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా సొసైటీని రిజిస్టర్ చేసి బాధ్యతలు అప్పగించాలన్నారు. బ్రాహ్మణ సదన్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాహ్మణులకు ఆశ్రయం కలిపించాలన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, ఆధ్యాత్మిక లైబ్రరీ, ఇన్ఫ్‌ర్మేషన్ సెంటర్ అన్నీ సదన్‌లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

చిత్రం..బ్రాహ్మణ సంక్షేమ సొసైటీ ఏర్పాటుపై మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్