రాష్ట్రీయం

నకిలీ కరెన్సీ చెలామణి కేసు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు నిందితులకు హైదరాబాద్ ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు విధించిన శిక్షనే ధ్రువీకరిస్తూ జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఎన్‌ఐఏ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను సవాలు చేస్తూ నిందితులు మసూద్ అక్తర్, మహ్మద్ షఫీ, షేక్ ఆక్రం హైకోర్టులో అపీల్ చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పి విష్ణు వర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నిందితులు నేరానికి పాల్పడేందుకు ఆధారాలు చూపించామన్నారు. నిందితుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఎటిఎం రంగరామానుజం వాదిస్తూ దిగువ కోర్టు సాక్ష్యాలు లేకపోయినా శిక్షను విధించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను తెచ్చి చలామణి చేస్తున్నారనడానికి ఆధారాలు లేవన్నారు. కాగా నిందితులకు ఎన్‌ఐఎ కోర్టు విధించిన శిక్షనే ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.