ఆంధ్రప్రదేశ్‌

ఏపి ట్రాన్స్‌కోకు గోల్డెన్ పీకాక్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: నాణ్యమైన విద్యుత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినందుకు ఏపి ట్రాన్స్‌కోకు ప్రతిష్టాకరమైన గోల్డెన్ పీకాక్ హెచ్‌ఆర్ ఎక్సెలెన్స్ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ ఈ అవార్డును ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు రవిశంకర్ చేతుల మీదుగా స్వీకరించారు. విజయానంద్ మాట్లాడుతూ ఆంద్రాలో విద్యుత్ పంపిణీ నష్టాలు 2.97 శాతానికి తగ్గాయన్నారు. ఇతర రాష్ట్రాలకు ఐదు వందల నుంచి వెయ్యి మెగావాట్ల వరకు సరఫరా చేసే స్ధాయికి ఏపి ఎదిగిందన్నారు. పరిశ్రమలకు ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి మాట్లాడుతూ ఆంధ్ర డిస్కాంలు ఉదయ్ స్కీంలో చేరాయని, దీని వల్ల నష్టాల భారం తగ్గిందన్నారు. రాష్ట్రం డిస్కాంలను ఆదుకునేందుకు రూ. 8256.01 కోట్ల బాండ్లను విడుదల చేశాయన్నారు. ఇందులో బ్యాంకులు 4041.33 కోట్ల రూపాయల మేరకు బాండ్లను స్వీకరించాయన్నారు. ఇతర సంస్ధలు రూ.3334 కోట్ల బాండ్లను తీసుకున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.9వేల కోట్ల నిధులను మంజూరు చేశాయన్నారు. వచ్చే పదేళ్లలో రూ.64 వేల కోట్లతో 11210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నాట్లు చెప్పారు.

గోల్డెన్ పీకాక్ హెచ్‌ఆర్ ఎక్సెలెన్స్ అవార్డు అందుకుంటున్న ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్