రాష్ట్రీయం

కోడి పందేలకు అనుమతి ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: సంక్రాంతి సందర్భంగా బెట్టింగ్‌లతో కూడిన కోడి పందేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తిలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరఫున హోంశాఖ న్యాయవాది బి సత్యనారాయణ ప్రభుత్వ వాదనలను నివేదికగా హైకోర్టుకు సమర్పించారు. కోడి పందేలపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? ఏలాంటి చర్యలు తీసుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందేలకు అనుమతి కోరుతూ తన క్లయింట్ రఘు రామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారని సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. కోడి పందేలకు అనుమతి ఇచ్చే విషయాన్ని హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీం కోర్టు స్టేటస్ కో మంజూరు చేసిందన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడి పందేలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని కోడి పందేలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా భాష్యం చెప్పరాదని పేర్కొంది. జంతు సంక్షేమ బోర్డు తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోడి పందేలకు చట్టప్రకారం అనుమతి ఇచ్చే అవకాశం లేదన్నారు. కోడి పందేలకు అనుమతి ఇవ్వమని అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసు విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.