రాష్ట్రీయం

‘హిరాఖండ్’పై ఎన్‌ఐఎ, సిఐడి బృందాల దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 23: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనలో 41 మంది దుర్మరణం కావడంపై కేంద్ర దర్తాప్తు బృందం (ఎన్‌ఐఎ), సిఐడి బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. బిశ్వాస్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఎన్‌ఐఎ బృందం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగిన కూనేరు రైల్వే కేబిన్ వద్దకు చేరుకున్నారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎన్ని గంటలకు అక్కడకు చేరుకుంది, పట్టా విరిగిన తరువాత రైలు ఎంత దూరం ముందుకు ప్రయాణించింది వంటి అంశాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కేబిన్‌లో ఉన్న సిబ్బంది నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కేబిన్‌మెన్ మాట్లాడుతూ రైలు వచ్చే సమయంలో తాను బయటకు వచ్చి చూడగా రైలు చక్రాల వద్ద మంటలు కన్పించాయని తెలిపారు. అదే విషయాన్ని స్టేషన్ మాస్టర్‌కు తెలియజేసేలోపు పట్టాలపై పెద్ద శబ్దం విన్పించిందని పేర్కొన్నారు. అనంతరం బోగీలు పడి ఉన్న తీరు, పట్టాలు విరిగిన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో విరిగిన పట్టా ముక్కలను సేకరించారు.
సిఐడి దర్యాప్తు
కూనేరు రైలు ప్రమాదంపై జిఆర్‌పి కేసు ఫైలు చేయగా, దానిని రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. సిఐడి డిజి అమిత్‌గార్గ్, అడిషనల్ డిజి ద్వారకా తిరుమలరావు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై ఐదు కోణాలలో తాము దర్యాప్తు చేస్తున్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇది విద్రోహమా? సాంకేతిక లోపమా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కుట్ర వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని కొట్టి పారేయలేమని ఆయన బదులిచ్చారు.
రైల్వే సేఫ్టీ కమిషనర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మోహనరావు ఇతర తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.