రాష్ట్రీయం

ఈడ్చేసిన ఆటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: రెండ్రోజుల క్రితం పాతబస్తీలో పాదచారిపైకి ఎక్కి చంపిన ఆటో సంఘటన మరువక ముందే మంగళవారం రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళ అత్తాపూర్‌లోని కాశిపతి ఆటో స్టాండ్ అడ్డావద్ద ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఆటో రాడ్‌ను పట్టుకుని లోపలికి ఎక్కుతున్న సమయంలో ఆటో ముందుకెళ్లిపోయంది. దాదాపు 200 మీటర్ల దూరం వరకూ మహిళను ఆటో వేగంగా ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్ ఇన్స్‌పెక్టర్ వి ఉమెందర్ ప్రమాద ఘటనను నిర్థారించారు. అయతే, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.

చిత్రం..నడిరోడ్డుపై మహిళను ఈడ్చుకుపోతున్న ఆటో