రాష్ట్రీయం

కాపు యువతకు రూ. 2లక్షల లోపు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పాటైన కాపు కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులైన కృష్ణాజిల్లా కైకలూరు వాసి చలమలశెట్టి రామానుజయ్యతోపాటు డైరక్టర్లుగా యర్రా వేణుగోపాలరాయుడు (రాజమండ్రి), యర్రా నవీన్ (తాడేపల్లిగూడెం), వడ్డెల్ల సాంబశివరావు (నందిగామ), నారాపుశెట్టి పాపారావు (దర్శి), వెదుర్ల రామచంద్రరావు (నంద్యాల), కంఠా మురళీమోహన్ రాయల (అనంతపురం), మోదుగుల పెంచలయ్య (రాజంపేట) మంగళవారం నాడిక్కడ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ చలమలశెట్టి మాట్లాడుతూ కాపుల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం వంద కోట్లు కేటాయించటం జరిగిందన్నారు. కాపు యువత ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టగలనన్నారు. 50 శాతం సబ్సిడీతో రూ.2 లక్షలలోపు రుణాలు అందించనున్నామన్నారు. రూ.2 లక్షలకు మించి రుణాలతో గరిష్టంగా లక్ష సబ్సిడీ ఉండేలా పథకాలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కాపు సామాజికవర్గం వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కొనకళ్ల వెంకట నారాయణ పాల్గొన్నారు.