రాష్ట్రీయం

ఎన్నికల చట్టాల్లో సంస్కరణలు రావాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: మన దేశంలో ఎన్నికల చట్టాల్లో పక్కా సంస్కరణలు రావల్సిన అవసరం ఎంతైన ఉందని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఓటు హక్కును వినియోగించుకునే వారి శాతం బాగా తగ్గిపోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి సంయుక్త్ధ్వార్యంలో బుధవారం రవీంద్రభారతిలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన గవర్నర్ తొలుత వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఆ తర్వాత ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎన్నికలు మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించేందుకు వీలుగా సంస్కరణలు రావాలని, ఇది తాను ఒక గవర్నర్‌గా కాకుండా దేశ పౌరుడిగా డిమాండ్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించటంతో సమావేశ మందిరం సభికుల కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఎన్నికల్లో నేర చరిత్ర కల్గిన వారిని పోటీ చేయకుండా అడ్డుకోవల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడెవిట్లు ఇచ్చి రిటర్నింగ్ అధికారులను తప్పుదోవ పట్టించే వారిని, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బు, మద్యం వంటివి పంపిణీ చేస్తూ కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నా, అవి ఎక్కడికి పోతున్నాయి? నిందితులపై నమోదు చేసిన కేసులు తేలేందుకు ఎందుకు ఏళ్లతరబడి సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నేరాలు పాల్పడినా, బాధ్యులను వెంటనే జైల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసులను కేవలం మూడు నెలల వ్యవధిలోనే విచారించి, బాధ్యులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన సంస్కరణలు రావాలన్నారు. ఈ రకమైన అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరముందన్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తే ఏ కోర్టు అయినా వారిని దోషులుగా తేల్చితే, ఇక వారు ఎగువ కోర్టుల్లో అప్పీలుకు వెళ్లే అవకాశం లేకుండా సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భావితరాలను, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన పెంపొందించాలన్నారు. చట్టాల్లో మరిన్ని గొప్ప సంస్కరణలను తీసుకువచ్చి దేశంలో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించి మన జాతీయ ఎన్నికల కమీషన్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు, ఓటర్లు ఇద్దరు సమానులైనని వివరించారు. ఓటు హక్కు ఉన్న వారందరూ ఓట్లు వేయాలని, కానీ ఆలోచించి సమర్థులైన వారిని ఎన్నుకునే దిశగా ఓటర్లు ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ భన్వర్‌లాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
chitram...
వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు
బహుమతులను ప్రదానం చేస్తున్న గవర్నర్ నరసింహన్